Monday 18 August 2014

భవ్యమైన కెరీర్‌కు... ఏఎంఈ

ఒక విమానం గాల్లోకి ఎగరాలంటే లెసైన్స్‌డ్ మెయింటనెన్స్ ఇంజనీర్ అనుమతి తప్పనిసరి. అన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో క్షుణ్నంగా తనిఖీ చేసుకున్న తర్వాతే ఈ అనుమతి లభిస్తుంది. విమానం క్షేమంగా గమ్యస్థానం చేరుకోవాలంటే అందులో అన్ని యంత్రాలు సక్రమంగా పనిచేయాలి. అది టెక్నికల్‌గా, ఫిజికల్‌గా పర్ఫెక్ట్‌గా ఉండేలా చూసే నిపుణుడే.. ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటనెన్స్ ఇంజనీర్(ఏఎంఈ). విమాన ప్రయాణం మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటులోకి వస్తుండడంతో మన దేశంలో విమానయాన సంస్థల సంఖ్య పెరుగుతోంది. కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏఎంఈలకు డిమాండ్ విసృ్తతమవుతోంది. దీన్ని కెరీర్‌గా ఎంచుకుంటే దేశవిదేశాల్లో భారీ వేతనాలతో కూడిన ఉద్యోగావకాశాలు దక్కుతున్నాయి. 
ప్రారంభం నుంచే మంచి వేతనాలు ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటనెన్స్ ఇంజనీరింగ్ అనేది మిగిలిన ఇంజనీరింగ్ వృత్తులకంటే భిన్నమైనది. బీఈ/బీటెక్ కోర్సు వ్యవధి నాలుగేళ్లు కాగా మూడేళ్లలో ఏఎంఈ కోర్సు పూర్తిచేయొచ్చు. ఏఎంఈలకు ప్రభుత్వ, ప్రైవేట్ విమానయాన సంస్థలతోపాటు డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ), హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్) వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ ఉద్యోగాలు లభిస్తాయి. ఈ రంగంలో ప్రారంభం నుంచే ఆకర్షణీయమైన వేతనాలు ఉంటాయి. ప్రముఖ ఎయిర్‌లైన్స్ సంస్థల్లో చేరితే భారీ వేతనాలు, భత్యాలు అందుకోవచ్చు. 

స్కిల్స్ అప్‌డేట్ చేసుకోవాలిఏఎంఈగా కష్టపడి పనిచేస్తే కెరీర్‌లో వేగంగా పైకి ఎదగొచ్చు. ప్రయాణికుల భద్రతతో ముడిపడి ఉన్న రంగం కాబట్టి ప్రతిక్షణం అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఒక్కోసారి చిన్న తప్పిదం కూడా భారీ ప్రమాదానికి దారితీస్తుంది. టెక్నికల్ స్కిల్స్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలి. లెసైన్స్‌డ్ ఏఎంఈలకు డీజీసీఏ ప్రతిఏటా పరీక్ష నిర్వహిస్తుంది. ఇందులో ఉత్తీర్ణత సాధిస్తేనే లెసైన్స్‌ను పొడిగిస్తారు. లేకపోతే రద్దు చేస్తారు. ఎయిర్‌లైన్స్ సంస్థలు షార్ట్ టర్మ్ ట్రైనింగ్ కోర్సులను నిర్వహిస్తుంటాయి. వీటిద్వారా నైపుణ్యాలను పెంచుకోవాలి. 

అర్హతలు: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణత సాధించినవారు ఏఎంఈ కోర్సులో చేరేందుకు అర్హులు. డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఆమోదించిన కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. డీజీసీఏతోపాటు కళాశాల నిర్వహించే అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణులైతే ఏఎంఈగా లెసైన్స్ పొందొచ్చు. 

వేతనాలు: ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటనెన్స్ ఇంజనీర్‌కు ప్రారంభంలో నెలకు రూ.20 వేల నుంచి రూ.40 వేల వేతనం లభిస్తుంది. అనుభవం, పనితీరును బట్టి వేతనం పెరుగుతుంది. సీనియర్లకు నెలకు రూ.లక్షకు పైగానే అందుతుంది. సంస్థను బట్టి వేతనాల్లో వ్యత్యాసాలు ఉంటాయి. 

ఏఎంఈ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:
  • రాజీవ్‌గాంధీ ఏవియేషన్ అకాడమీ-సికింద్రాబాద్ 
    వెబ్‌సైట్:
     www.rgaviation.com 
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వెబ్‌సైట్:http://iiaeit.org/ 
  • స్కూల్ ఆఫ్ ఏరోనాటిక్స్ 
    వెబ్‌సైట్: www.soapalam.org 
  • హిందూస్థాన్ ఏరోస్పేస్ అండ్ ఇంజనీరింగ్ 
    వెబ్‌సైట్: www.haepune.com 
  • పవన్‌హన్స్ హెలికాప్టర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ 
    వెబ్‌సైట్: www.pawanhans.co.in
సవాలుతో కూడుకున్న కెరీర్!
శ్రీఎయిర్‌క్రాఫ్ట్ మెయింటనెన్స్ ఇంజనీర్లకు ప్రస్తుతం ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ అకాడమీ, రాజీవ్‌గాంధీ ఏవియేషన్ అకాడమీ, ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ తదితర సంస్థలు ఏఎంఈ కోర్సులను ఆఫర్ చేస్తున్నా యి. ఈ కోర్సులు పూర్తిచేసిన వారికి కొన్ని సంస్థలు యూనివర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకుని బీఎస్సీ డిగ్రీలను ప్రదానం చేస్తున్నాయి. అలాగే మరికొన్ని సంస్థలు ఎమ్మెస్సీ ఏవియేషన్ కోర్సులను కూడా అందిస్తున్నాయి. ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటనెన్స్ ఇంజనీరింగ్‌లో విద్యార్థి 75శాతం మార్కులు సాధిస్తేనే ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. కాబట్టి ఈ కోర్సులు పూర్తి చేయాలంటే కఠోర శ్రమ తప్పనిసరి. కోర్సులను విజయవంతంగా పూర్తి చేసిన వారికి డీజీసీఏ పరీక్ష నిర్వహించి లెసైన్‌‌సలు మంజూరు చేస్తుంది. దాంతో ఎయిర్‌లైన్స్ సంస్థల్లో ఉద్యోగాలు పొందొచ్చు. ఆకర్షణీయమైన వేతనాలు లభిస్తాయి. ఈ కెరీర్ సవాలుతో కూడుకున్నది. ఎయిర్‌క్రాఫ్ట్ రిపేరింగ్ విషయంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించడానికి అవకాశం ఉండదు. సూక్ష్మ పరిజ్ఞానం ఉండాలి. ఓపికతో పనిచేయాల్ణి.

- ప్రొ. వై.బి.సుధీర్ శాస్త్రి, హెచ్‌ఓడీ, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, 
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, హైదరాబాద్

0 comments:

Post a Comment