Thursday, 4 September 2014

ఎస్ఎస్సీ లోయర్ డివిజన్ క్లర్క్, డాటా ఎంట్రీ ఆపరేటర్ గైడెన్స్

ఎస్ఎస్సీ లోయర్ డివిజన్ క్లర్క్, డాటా ఎంట్రీ ఆపరేటర్ గైడెన్స్


కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో డాటా ఎంట్రీ ఆపరేటర్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టుల భర్తీకి నిర్వహించే కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవల్ పరీక్ష నోటిఫికేషన్ను స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ విడుదల చేసింది. కేవలం ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ప్రవేశించాలంటే ప్రిపరేషన్ పక్కాగా సాగాల్సిందే. ప్రస్తుత పోటీ పరీక్షల తీరులో మార్పు వచ్చింది. అన్నీ పరీక్షల్లోనూ ప్రధానంగా జనరల్ నాలెడ్జ్ లేదా అవేర్నెస్ , న్యూమరికల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, బేసిక్ ఇంగ్లిష్ పరిజ్ఞానం నుంచే ప్రశ్నలు వస్తున్నాయి. కానీ పరీక్షను బట్టి ప్రశ్నల కఠినస్థాయి మారుతుంది. ఎస్ఎస్సీ నిర్వహించే కంబైన్డ గ్రాడ్యుయేట్ లెవల్, స్టెనోగ్రాఫర్స్, జూనియర్ ఇంజనీర్స్, సబ్ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ ఇన్ సీఐఎస్ఎఫ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వంటి పరీక్షల్లో దాదాపు ఒకే సిలబస్ ఉంటుంది. కానీ ప్రశ్నల స్థాయి, పరిధి మారుతుంది. ఈ తరుణంలో నోటిఫికేషన్ వివరాలు, ప్రిపరేషన్ గైడెన్స్, స్టడీ మెటీరియల్, పాతప్రశ్నా పత్రాలు మీ కోసం..
నోటిఫికేషన్ వివరాలు..పోస్టులు: హైయర్ సెకండరీ లెవల్ (డాటా ఎంట్రీ ఆపరేటర్, లోయర్ డివిజన్ క్లర్క్)
విద్యార్హత : 10+2 ఉత్తీర్ణత, టైపింగ్ స్కిల్స్ ఉండాలి.
వయోపరిమితి: 18 - 27 సంవత్సరాలు (01.08.2014 నాటికి)
ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట ద్వారా
దరఖాస్తు రుసుం: రూ.100/- (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ కు ఫీజు లేదు.) 
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లోదరఖాస్తు చేయాలి. ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసేవారు ‘‘సెంట్రల్ రిక్రూట్మెంట్ ఫీ స్టాంప్’’ ద్వారా ఫీజు చెల్లించాలి. ఆన్ లైన్ లో చేసేవారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయాలి. 
దరఖాస్తు సమర్పణ: ప్రింట్ తీసిన లేదా నిర్ణీత ఫార్మాట్లో పూర్తి చేసిన దరఖాస్తును తగిన విద్యార్హత పత్రాలు జతచేసి గడువు తేదీ లోగా రీజనల్/సబ్ రీజనల్ కమీషన్ ఆఫీసు కు చేరేలా పంపాలి.

ముఖ్యమైన తేదీలుదరఖాస్తులు ప్రారంభం: 19.07.2014
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది: 19.08.2014
రాత పరీక్ష తేది: 02.11.2014, 09.11.2014
వెబ్సైట్: http://ssc.nic.in/notice/examnotice/CHSLE-2014%20%20Notice%20E.pdf
Apply onlinehttp://ssconline.nic.in/mainmenu2.php

ప్రణాళికాబద్ధంగా సిద్ధమవ్వండి..రాత పరీక్షా విధానం: ఈ పేపర్లో 200 బహుళైచ్ఛిక(మల్టిపుల్ చాయిస్) ప్రశ్నలుంటాయి. సమయం 2 గంటలు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్ లేదా హిందీలో ఉంటుంది. నెగెటివ్ మార్కులు లేవు.
సబ్జెక్టు/విభాగం{పశ్నలుగరిష్ట మార్కులుసమయం
జనరల్ ఇంటెల్లిజెన్స్5050
జనరల్ ఇంగ్లిష్50502 గంటలు
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్5050
జనరల్ అవేర్నెస్5050

సిలబస్ / ప్రిపరేషన్ ప్లాన్: జనరల్ ఇంటెల్లిజెన్స్: ఈ విభాగంలో పోలికలు-బేధాలు(similarities and differences), సమస్య సాధన (problem solving), విశ్లేషణ (analysis), అనాలజీ (నంబర్, ఫిగర్, వర్డ్) జడ్జిమెంట్, డెసిషన్ మేకింగ్, విజువల్ మెమరీ, ఆరిథ్మెటిక్ నంబర్ సిరీస్, కోడింగ్ డీకోడింగ్, నాన్ వర్బల్ సిరీస్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇతర ఎస్ఎస్సీ పరీక్షలు, బ్యాంక్ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఈ విభాగం సులువుగా ఉంటుంది. నిరంతర సాధన, ఎక్కువ మోడల్ పేపర్లు రాయడం వల్ల ఈ విభాగంలో మంచి మార్కులు పొందవచ్చు.

ఇంగ్లిష్ లాంగ్వేజ్: 
ఇందులో అభ్యర్థి ఇంగ్లిష్ పరిజ్ఞానాన్ని ప్రాథ మిక స్థాయిలో పరీక్షిస్తారు. Spot the Error, Fill in the Blanks, Synonyms/Homonyms, Antonyms, Spellings/ Detecting Mis-spelt words, Idioms & Phrases, One word substitution, Improvement of Sentences, Active/Passive Voice of Verbs, Conversion into Direct/Indirect narration, Shuffling of Sentence parts, Shuffling of Sentences in a passage, Cloze Passage, Comprehension Passage వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. రోజూ ఒక ఇంగ్లిష్ దినపత్రికను చదువుతూ గ్రామర్, వొకాబులరీ, సిననిమ్స్, ఆంటోనిమ్స్ అభివృద్ధి చేసుకోవాలి. పార్ట్శ్ ఆఫ్ స్పీచ్, ప్రిపొజిషన్స్, ఆర్టికల్స్, ఆక్టివ్ అండ్ పాసివ్ వాయిస్, డెరైక్ట్ అండ్ ఇండెరైక్ట్ స్పీచెస్, క్వశ్చన్ ట్యాగ్స్, క్రియలు, విశేషణాలు వంటి వాటిపై ప్రాథమిక అవగాహన ఉండాలి. ఎక్కువగా ఇంగ్లిష్ పేపర్ చదవడం, వార్తలు, బృంద చర్చలు వినడం వల్ల ప్రిపరేషన్ సులువవుతుంది.

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: ఈ విభాగంలో నంబర్ సిస్టం, కంప్యూటేషన్ ఆన్ హోల్ నంబర్స్, డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్, రిలేషన్షిప్ బిట్వీన్ నంబర్స్, ఫండమెంటల్ ఆరిథ్మెటిక్ ఆపరేషన్స్ అయిన శాతాలు, నిష్పత్తి, సరాసరి, లాభనష్టాలు, బారు వడ్డీ, చక్రవడ్డీ, డిస్కౌంట్స్, మెన్సురేషన్, కాలం-దూరం, కాలం-పని, టేబుల్స్ అండ్ గ్రాఫ్స్, బార్ డయాగ్రమ్స్, పై చార్టులు, బీజగణితం, రేఖాగణితం, త్రికోణమితి వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. పదోతరగతి వరకు తెలుగు అకాడమీ మ్యాథ్స్ పుస్తకాలు బాగా సాధన చేయాలి. ఎస్ఎస్సీ పాత ప్రశ్నా పత్రాల విశ్లేషణ, వీలైనన్ని మోడల్ పేపర్లు రాయడం వల్ల తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవచ్చు. 

జనరల్ అవేర్నెస్: అభ్యర్థికి తన చుట్టూ జరుగుతున్న సంఘటనలు, మార్పులపై అవగాహన, వాటిని సమాజానికి అనువర్తించే విధానం వంటి వాటిని పరీక్షిస్తారు. దైనందిన జీవితంలో జరుగుతున్న మార్పులు, వర్తమాన వ్యవహారాలు, భారత్ - ఇతర దేశాలతో సంబంధం, క్రీడలు, అవార్డులు, జియోగ్రఫీ, ఆర్థిక వ్యవస్థ, భారత రాజకీయ వ్యవస్థ, భారత రాజ్యాంగం, శాస్త్ర పరిశోధనలు -ఆవిష్కరణలు వంటి వాటిపై ప్రశ్నలు ఉంటాయి. రోజూ ఏవైనా రెండు దినపత్రికలు(తెలుగు, ఇంగ్లిష్) చదవడం, సాక్షి భవిత, వెబ్సైట్లో లభించే కరెంట్ అఫైర్స్ ను చదవాలి. తాజా క్రీడలు-విజేతలు, అవి జరిగిన ప్రదేశాలు, బహుమతులు - ఉత్సవాలు, కొత్త ఆవిష్కరణలు, నియామకాలు, సదస్సులు - సమావేశాలు, కొత్త ప్రభుత్వ పథకాలు వంటి వాటిపై అవగాహన కలిగి ఉండాలి. బృందాలుగా ఏర్పడి వీటిని చర్చించడం వల్ల చాలా కాలం గుర్తుంటాయి.

స్కిల్ టెస్ట్:స్కిల్ టెస్ట్ ఇంగ్లిష్ లేదా హిందీలో ఉంటుంది. డాటా ఎంట్రీ ఆపరేటర్ గంటకు 8 వేల అక్షరాలను టైప్ చేయాలి. సమయం 15 నిమిషాలు. లోయర్ డివిజన్ క్లర్క్ ఇంగ్లిష్ అయితే నిమిషానికి 35 పదాలు, హిందీ అయితే 30 పదాలు టైప్ చేయాలి. రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి మాత్రమే స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.

రిఫరెన్స బుక్స్: ఆబ్జెక్టివ్ ఆర్థమెటిక్: ఎస్ ఎల్ గులాటీ, ఆర్.ఎస్ అగర్వాల్, 6 నుంచి పదో తరగతి వరకు మ్యాథ్స్ పుస్తకాలు.
న్యూమరికల్ ఆప్టిట్యూడ్ ఫర్ బ్యాంకింగ్: దిల్షాన్ పబ్లికేషన్స్ 
డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ అనాలసిస్: కిరణ్ పబ్లికేషన్స్
నాన్ వెర్బల్ రీజనింగ్ : ప్రభాత్ జావేద్
వెర్బల్ రీజనింగ్: ఆర్.ఎస్. అగర్వాల్
ఇంగ్లీష్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్: హరిమోహన్ ప్రసాద్, ఎ.కె. కపూర్
కరెంట్ అఫైర్స్ఇండియా ఇయర్బుక్, మనోరమ ఇయర్ బుక్, ఏవైనా రెండు దిన పత్రికలు (తెలుగు/ఇంగ్లిష్), ఏదైనా ప్రామాణిక కరెంట్ అఫైర్స్ మేగజీన్
జనరల్ నాలెడ్జ్: స్టాక్ జీకే కోసం ఏదైనా ప్రామాణిక పుస్తకం, కొన్ని వెబ్సైట్లు(సాక్షి ఎడ్యుకేషన్)
వీటితో పాటు 6 నుంచి పదో తరగతి వరకు మ్యాథ్స, సైన్స, సోషల్ అకడమిక్ పుస్తకాలు చదవడం లాభిస్తుంది. ఎన్సీఈఆర్టీ 11, 12వ తరగతి పుస్తకాలు కూడా ఉపయోగకరంగా ఉంటాయి.
Sectionwise Study Material
General Intelligence
General English
Quantitative Aptitude
General Awareness

0 comments:

Post a Comment